Skip to main content

Posts

Showing posts from August, 2021

బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు | ఆసక్తికరమైన విషయాలు.

బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు - ఆసక్తికరమైన విషయాలు 📎ఆదాము - ఎఱ్ఱనివాడు, నిర్మింపబడినవాడు. 📎అబ్రాము - గౌరవనీయుడగు తండ్రి. 📎హానోకు - ప్రతిష్టింపబడినవాడు. 📎నోవాహు - నెమ్మది  📎ఇస్సాకు- నవ్వు. 📎యాకోబు-మోసపుచ్చు వాడు.  📎కయీను -పొందుట;  📎హేబేలు-ఆవిరి. 📎ఏసావు-వెంట్రుకలు గలవాడు.  📎యోసేపు-అభివృద్ధి ; 📎షెతు-బదులుగా ఇవ్వబడినవాడు;  📎అబ్రహాము- అనేక జనములకు తండ్రి.  📎బయర్షెబా -ప్రమాణపు బావి.  📎బేతేలు-దేవుని ఇల్లు; 📎హెబ్రోను -సహవాసం. 📎హవ్వ -జీవము 📎లేయ -అడవి ఆవు.  📎రాహేలు -ఆడగొర్రె;  📎శారాయి-జగడగొండి; శారా-రాజమారి 📎రిబ్కా- ఉచ్చుతాడు 📎దీనా -న్యాయపు తీర్పు 📎తామారు-ఈతచెట్టు. 📎షేము- పేరు,నామము;  📎హాము-అల్లకల్లోలం, నల్లనివాడు;  📎హాగరు-యాత్రికురాలు,సంచరించుట. 📎మెల్కిసేదెకు-నీతిరాజు, 📎షాలేము యాజకుడైన రాజు;  📎మెతూషెల -ఈటే గలవాడు. 📎ఎఫ్రాయిము-రెండంతలువృద్ధి, ఫలము 📎ఎఫ్రాతా -ఫలవంతమైన స్థలం. 📎ఏదేను- ఉల్లాసము;  📎నిమ్రోదు- తిరుగుబాటు, దైవ ద్రోహి.  📎ఎనోషు- మానవుడు;  📎బాబేలు- గందరగోళం. 📎మోషే -నీటి నుండి...

క్రొత్త నిబంధన లో ప్రదేశాలు, ఇప్పుడు వాటి దేశాలు.

క్రొత్త నిబంధన లో ప్రదేశాలు - ఇప్పుడు వాటి దేశాలు: బెత్లెహేము - ఇజ్రాయిల్ రామ - ఇజ్రాయిల్ ఇశ్రాయేలు - ఇజ్రాయెల్ నజరేతు ఇజ్రాయిల్ జెబులును ఇజ్రాయిల్ నాఫ్తాలి - ఇజ్రాయిల్ గదరే నీయులు జోర్డాన్ కొరాజీను - ఇజ్రాయిల్ బెత్సయిదా - ఇజ్రాయిల్ నినేవే - ఇరాక్ బెత్పగే - ఇజ్రాయిల్ గెత్సమనే - ఇజ్రాయిల్ గొల్గోత ఇజ్రాయిల్ కపెర్నహూము - ఇజ్రాయిల్ గేరాసేను - జోర్డాన్ ఇదుమ - ఇజ్రాయిల్ గిన్నెసెరేతు - ఇజ్రాయిల్ ఎరికో - పాలస్తీనా యూదా - ఇజ్రాయిల్ తిబెరి - ఇజ్రాయిల్ ఇతురయ - ఇజ్రాయిల్ త్రకోనితి - ఇజ్రాయిల్ ఎమ్మాయి - ఇజ్రాయిల్ సు కారు - ఇజ్రాయిల్ తిబిరియా - ఇజ్రాయిల్ కెద్రోను - ఇజ్రాయిల్ ఎరుషలేము - ఇజ్రాయిల్ యూదయ ఇజ్రాయిల్ సమరయ - ఇజ్రాయిల్ గలిలయ - ఇజ్రాయిల్ పార్తియులు - ఇరాన్ మాది యులు - ఇరాన్ ఎలామియులు - ఇరాన్ మెసపటోమియా - ఇరాక్ కప్ప దోకియ - టర్కీ పొంతు - టర్కీ ఆసియా - టర్కీ ప్రుగియ - టర్కీ పంపు లియా - టర్కీ ఐగుప్తు - ఈజిప్ట్ కురే నియా - లిబియా లిబియా - లిబియా రోమా - రోమ్ క్రేతియులు - గ్రీస్ అరబియులు - సౌదీ కుప్ర - సైప్రస్ కిలికియ - టర్కీ హారాను - టర్కీ కల్దియులు - ఇరాక్ కనాను ఇజ్రాయిల్ పాలస్తీనా షెకెము - ఇ...

దేవుడిచ్చిన జ్ఞానముతో సలోమను గారి తీర్పు

సొలోమోను ప్రార్థనకు జవాబు 1 రాజులు 3:16:28 ఒక రోజు ఇద్దరు స్త్రీలు తమ తగువు తీర్చమని సొలొమోను రాజు దగ్గరికి వచ్చారు. అందులో ఒకామె రాజుతో ఇలా అంది. "మహరాజా! ఈమె నేనూ ఒకే ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో నేను ఒక మగ బిడ్డను కన్నాను. అప్పుడు ఆమె అక్కడే ఉంది. నాకు బిడ్డపుట్టినరెండు రోజులకి ఆమె ఒక మగబిడ్డనికనింది.  ఆ ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. అయితే, రాత్రి పొరపాటున అది తన పక్కలో ఉన్న బిడ్డ మీద దొర్లింది. ఆ బిడ్డ చనిపోయాడు. రాత్రి నేను నిద్రపోయేప్పుడు అది వచ్చి నా పక్కలో ఉన్న నా బిడ్డను తీసుకొని తన పక్కలో పడుకో బెట్టుకుంది. ఉదయం పాలు పడదామని చూస్తే నా పక్కలో ఉన్న బిడ్డ చని పోయిన్నాడు. బాగా నిదానించి చూశాను, నాబిడ్డ కాడని తెలుసుకున్నాను.  కానీ రెండో స్త్రీ "లేదు బతికి ఉంది నా బిడ్డ, చనిపోయింది నీ బిడ్డ!" అంది. మొదటి స్త్రీ తిరిగి “కాదు! చనిపోయింది నీ బిడ్డ, బతికి ఉంది నా బిడ్డ!" అంది. అలా ఆ స్త్రీలు ఇద్దరూ రాజు ముందు గట్టిగా అరుస్తూ పోట్లాడు కుంటున్నారు.  అప్పుడు సొలొమోను రాజు “బతికిన బిడ్డ నాది. చనిపోయిన బిడ్డ నీది". అని ఇద్దరూ తగువులాడు కుంటున్నారు. కనుక రాజు సైనికుడిని కత్తి...

23 వ కీర్తన | యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు

23 వ కీర్తన:  యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యెహోవ మందిరములో నేను నివాసము చేసెదను.