సొలోమోను ప్రార్థనకు జవాబు 1 రాజులు 3:16:28
ఒక రోజు ఇద్దరు స్త్రీలు తమ తగువు తీర్చమని సొలొమోను రాజు దగ్గరికి వచ్చారు. అందులో ఒకామె రాజుతో ఇలా అంది. "మహరాజా! ఈమె నేనూ ఒకే ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో నేను ఒక మగ బిడ్డను కన్నాను. అప్పుడు ఆమె అక్కడే ఉంది. నాకు బిడ్డపుట్టినరెండు రోజులకి ఆమె ఒక మగబిడ్డనికనింది.ఆ ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. అయితే, రాత్రి పొరపాటున అది తన పక్కలో ఉన్న బిడ్డ మీద దొర్లింది. ఆ బిడ్డ చనిపోయాడు. రాత్రి నేను నిద్రపోయేప్పుడు అది వచ్చి నా పక్కలో ఉన్న నా బిడ్డను తీసుకొని తన పక్కలో పడుకో బెట్టుకుంది. ఉదయం పాలు పడదామని చూస్తే నా పక్కలో ఉన్న బిడ్డ చని పోయిన్నాడు. బాగా నిదానించి చూశాను, నాబిడ్డ కాడని తెలుసుకున్నాను.
కానీ రెండో స్త్రీ "లేదు బతికి ఉంది నా బిడ్డ, చనిపోయింది నీ బిడ్డ!" అంది. మొదటి స్త్రీ తిరిగి “కాదు! చనిపోయింది నీ బిడ్డ, బతికి ఉంది నా బిడ్డ!" అంది. అలా ఆ స్త్రీలు ఇద్దరూ రాజు ముందు గట్టిగా అరుస్తూ పోట్లాడు కుంటున్నారు.
అప్పుడు సొలొమోను రాజు “బతికిన బిడ్డ నాది. చనిపోయిన బిడ్డ నీది". అని ఇద్దరూ తగువులాడు కుంటున్నారు. కనుక రాజు సైనికుడిని కత్తి తీసుకొని రమ్మన్ని ఆజ్ఞాపించి "బతికి ఉన్న బిడ్డను రెండు ముక్కలు చేసి చెరో ముక్క ఇవ్వండి" అన్నాడు.
ఆ మాట వినగానే అసలు తల్లి తన బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్ల పేగులు తరుగుకొనిపోయి "మహారాజా! దయచేసి బిడ్డను చంపకండి, బిడ్డను దానికే ఇప్పించండి" అని గుండెలు పగిలేలా ఏడుస్తూ మనవి చేసింది. అయితే రెండో స్త్రీ “మా ఇద్దరిలో ఎవరికీ బతికిన బిడ్డను ఇవ్వొద్దు. వాడిని రెండు ముక్కలు చేసి చేరొక ముక్క ఇప్పించండి" అంది.
అందుకు సొలొమోను రాజు “బిడ్డను చంప వద్దు! ఆ బిడ్డను మొదటి స్త్రీకే ఇవ్వండి. ఆమే ఆ బిడ్డకు తల్లి” అని తీర్పు చెప్పాడు.
ఇస్రాయేలు ప్రజలంతా రాజు తీర్చిన తీర్పు గురించి విని ఆ దేవుడే జ్ఞానం ఇచ్చాడని గ్రహించి, అతనికి భయపడ్డారు. ఎంతో గౌరవించారు.

Post a Comment
Post a Comment