నీతి న్యాయములు సత్యం ధర్మములు | neethi nayayamulu sathyam dharmamulu song lyrics

Post a Comment
Neeti Nayayamulu sathyam dharmamulu song lyrics by sagar


రచన, స్వరకల్పన: డా॥ కె.ఎస్.వి.సాగర్ గారు (Sagar Brother garu)

పల్లవి: 
నీతి న్యాయములు సత్యం ధర్మములు
నీ సింహాసనానికి ఆధారములూ...
ప్రేమా కనికరములు బలము జ్ఞానము 
నీ స్వభావ లక్షణములు యెహోవా 
నీ స్వభావ లక్షణములు యెహోవా...

||నీతి న్యాయములు సత్యం ధర్మములు||

నీతిమంతుడు దాగే చోటు నీవే 
మరణించినా మమ్మును బ్రతికిస్తావే (2 సార్లు ) 
మనిషికి మరణం ముగింపు కాదని 
మరో బ్రతుకు మాకు ఉంటుందని (2 సార్లు )
ప్రకటిస్తాము సువార్తను

||నీతి న్యాయములు సత్యం ధర్మములు||

తండ్రి కుమార పరిశుద్ధాత్ములారా 
మా కొరకు శ్రమపడుచు ఉన్నారా! (2 సార్లు )
తీర్చుకోగలమా మీ ఋణములనూ... 
నేర్చుకుంటాము మీ మాటలను 
మార్చుకుంటామూ మా బ్రతుకులను (2 సార్లు )

||నీతి న్యాయములు సత్యం ధర్మములు||


Related Posts

Post a Comment