Skip to main content

ఏసు క్రీస్తు ప్రభువు రెండోవ రాకడ సూచనలు. క్రైస్తవులకు హెచ్చరిక. నీవు సిద్ధ పడి ఉన్నావా...?



షాలోమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మీ అందరికి నా వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.  

మనం రాకడకు చాల సమీపంలో ఉన్నాము. మన ప్రవర్తన ఎలా ఉందో  కనిపెట్టుకొని ఉండాలి.  

దయ చేసి ఈ ఆర్టికల్ లో ఏదైనా తప్పులు ఉంటె క్రింద కామెంట్ లో తెలియచేయగలరు. మీకు ఏదయినా రాకడ సూచనలు గురించి తెలిస్తే దయ చేసి ఈ ఆర్టికల్ కామెంట్ బాక్స్ లో తెలియచేయవలెను. నేను ఈ ఆర్టికల్ కి మీరు కామెంట్ చేసిన సూచనలు జత పరచడానికి ప్రయత్నిస్తాను.  

నా పేరు పృథ్వి. నా వయసు 24. నేను పాస్టర్ ని కాను, నేను మీలాగే ఒక విశ్వాసిని. నేను ఈ లోకం లో గమనించిన సూచనలను గురించి తెలియజేయాలని ఆసక్తితో ఉన్నాను.  

పరమ తండ్రి- దేవుడు నాకు ఈ బ్లాగ్ ద్వారా, ఏసు క్రీస్తు ప్రభువు రెండవ రాకడ సూచనలు మీ అందరికీ ప్రకటింప చేసే భాగ్యమును నాకు ఇచ్చినందుకు నేను కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. 

ఈ ఆర్టికల్ లో నేను మీకు బైబిల్ ప్రకారం గా క్రీస్తు రెండవ రాకడ సూచనలు తెలియచేయాలని ఆశిస్తున్నాను. 


ఏసు క్రీస్తు ప్రభువు రెండోవ రాకడ సూచనలు. క్రైస్తవులకు హెచ్చరిక. నీవు సిద్ధ పడి ఉన్నావా...?

మనం మన తాతలు, ముత్తాతల కాలం నుంచి "క్రీస్తు రెండోవ రాకడ" అనే పదం వింటూనే ఉన్నాం. కానీ యేసు క్రీస్తు ప్రభువు ఇంకా రాలేదు. 

మన తరంలో ఏసు క్రీస్తు ప్రభువు రెండవ రాకడ రాదులే....  మనం తినుచు, త్రాగుచు, జీవితం మొత్తం సంతోషంగా బ్రతుకుదాం,  ఆ తర్వాత వృద్ధాప్యం వచ్చినప్పుడు దేవుని సేవ చేసేసి - పుణ్యాత్ములు అయిపోదాం అనే భ్రమలో నేటి క్రైస్తవ్యం ఉంది. 


మత్తయి సువార్త 24:48-51
48 అయితే దుష్టు డైన యొక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని
49 తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె
50 ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియ మించును.
51 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.

పై వచనములు బట్టి మనం ఎల్లప్పుడూ దేవుని రాజ్యాన్ని కనిపెట్టుకొని ఉండాలి. ఆలా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టే దాసులను దేవుడు మెచ్చుకుంటాడు.  

మత్తయి సువార్త 24: 45 యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు డెవడు?
46 యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.
47 అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.


యేసుక్రీస్తు ప్రభువు,  ఈ రోజు లేదా ఈ నెల లేదా ఈ సంవత్సరం 2020 లో వస్తారని నాకు తెలియదు. కానీ రాకడకు మనం చాల సమీపంగా ఉన్నాం అని మాత్రం నేను చెప్పగలను. 


మత్తయి సువార్త 24:36
అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.

 మత్తయి సువార్త 24:36 బట్టి క్రీస్తురెండోవ రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.

ఐతే మీరు ఎలా చెప్పగలరు యేసు క్రీస్తు రెండవ రాకడ సమీపంలో ఉంది అని......?

ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమని యేసు ప్రభువును శిష్యులు అడుగుతారు. 

మత్తయి సువార్త 24: 3 వ వచనము నుంచి 
4 యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.
5 అనేకులు నా పేరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.
6 మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
7 జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
8 అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.
9 అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.
10 అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.
11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;
12 అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.
13 అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును.
14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రక టింపబడును; అటుతరువాత అంతము వచ్చును.


ఇవన్నీ యేసు ప్రభువు చెప్పిన సూచనలు. ఇప్పుడు ఒకొక్క వచనాలను మనం పరిశీలిద్దాం. 

మత్తయి సువార్త 24:4,5
4 యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. 5 అనేకులు నా పేరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.


ప్రపంచవ్యాప్తంగా  చాల మంది నేనే  యేసు క్రీస్తును  అని చెప్పుకుంటున్నారు, మరియు చాలామంది భక్తులు వారిని అనుసరిస్తున్నారు.

గూగుల్ వికీపీడియా బట్టి 18 వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు చాల మంది నేనే యేసు క్రీస్తును అని పేర్కొన్నారు. 

క్రింద చూపించిన వ్యక్తులకు చాల మంది అనుచరులు ఉన్నారు. 

వీరే కాకుండా ఇంకా అనేకులు ప్రపంచ వ్యాప్తంగా నేనే క్రీస్తును అనే వారు కలరు. 

https://www.news.com.au/lifestyle/real-life/seven-men-around-the-world-who-each-claim-to-be-jesus-christ/news-story/563e56671b7c9931b6606619df6be4c8
అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.


మత్తయి సువార్త 24:6
6 మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.


మనం రోజు యుద్ద సమాచారం గురించి వింటూనే ఉన్నాం. రోజు ఏదోక రూపంలో ప్రపంచ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 

వికీపీడియా లో మీరు ఇప్పుడు యుద్ధ సమాచారం గురించి తెలుసుకోగలరు. 
https://en.wikipedia.org/wiki/List_of_wars:_2003%E2%80%93present

21వ శతాబ్దం ఆరంభం నుంచి వినిపిస్తున్న ‘మూడో ప్రపంచ యుద్ధం’ మాట రోజురోజుకూ మరింత స్ఫుటంగా వినిపిస్తోంది.

https://www.sakshi.com/news/funday/world-war-3-is-coming-488658
‘అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ఏ క్షణంలో అయినా ఘర్షణ ఆరంభం కావచ్చు.’ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఏప్రిల్‌ 15, 2017న చేసిన ప్రకటన ఇది. కానీ ఈ ఘర్షణ ఆ రెండు దేశాలకూ, లేదా మరికొన్ని దేశాలకే పరిమితమయ్యేది కాదు. క్షణాలలో ప్రపంచ దేశాల సమస్యగా మారుతుంది. ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుంది. ఇది రెండు ప్రపంచ యుద్ధాల చరిత్ర ముక్తకంఠంతో చెబుతున్న కఠోర వాస్తవం.

మన భారతదేశం పై చైనా, పాకిస్థాన్ యుద్ధ ఘర్షణలు మనం రోజు వింటూనే ఉన్నాం.  కాబట్టి బైబిల్ మత్తయి సువార్త 24:6 సూచనలు నెరవేరుతున్నాయి. 


china india war news
Add caption


యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు


మత్తయి సువార్త 24: 8 అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.


మత్తయి సువార్త 24: 8  అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.








లూకా సువార్త 21: 11 అక్క డక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.

Jesus with his desciples luke 21 verses



1918 నాటి స్పానిష్ ఫ్లూ 500 మిలియన్ల మందికి సోకింది మరియు ప్రపంచవ్యాప్తంగా కనీసం 50 మిలియన్లను చంపింది.





2014–2016 పశ్చిమ ఆఫ్రికాలో  ఎబోలా  వైరస్ వలన 28,610 మంది వ్యాధి బారిన పడ్డారు మరియు 11,308 మంది మరణించారు. 
ప్రస్తుతం, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎబోలా మహమ్మారితో పోరాడుతోంది. 2018 ఆగస్టులో వ్యాప్తి ప్రకటించినప్పటి నుండి 2,249 మంది మరణించారు మరియు 3,432 మంది సోకినట్లు WHO తెలిపింది.
ఎబోలా  వైరస్

ఎబోలా  వైరస్


2018 చివరిలో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 37.9 మిలియన్ల మంది హెచ్ఐవితో నివసిస్తున్నారు. అదే సంవత్సరంలో, 770,000 మంది హెచ్ఐవి సంబంధిత కారణాలతో మరణించారు మరియు 1.7 మిలియన్ల మంది క్రొత్తగా వ్యాధి బారిన పడ్డారు.
వైరస్ మొట్టమొదట కనుగొనబడినప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా 32 మిలియన్లకు పైగా ప్రజలు హెచ్ఐవి కారణంగా మరణించారని WHO(వరల్డ్ హెల్త్ సమస్త) తెలిపింది

హెచ్ఐవి



కరోనావైరస్

కరోనా వైరస్ గురించి వినని వాళ్ళు ఎవరు ఉండరు. 2020 వ సంవత్సరం లో ప్రపంచ నలుమూలల కరోనా వైరస్ వ్యాపించింది.  



కరోనావైరస్




కరోనావైరస్

ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.






మత్తయి సువార్త 24:12  వ వచనము నుంచి 
12 అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.
13 అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును.
14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రక టింపబడును; అటుతరువాత అంతము వచ్చును.



చూసారు కదా బ్రదర్స్ & సిస్టర్స్. మనం రాకడకు చాలా సమీపంగా ఉన్నాం.  రాకడ ఏ సమయంలో ఏ క్షణాన వస్తుందో ఎవరికీ తెలియదు. 


మిడతల దండు కూడా క్రీస్తు రాకడకు సూచనలు అని నేను భావిస్తున్నాను. మీరు ఏంఅంటారు? క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. 









ఎలా రక్షింపబడాలి?

యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడు అని నమ్మి బాప్తీస్మం తీసుకోవాలి. 
మారు మనస్సు పొంది దేవుని ఆజ్ఞలను పాటించాలి. 


అపొస్తలుల కార్యములు 16: 31-33
31 అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి
32 అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి.
33 రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి. 



యోహాను సువార్త 3: 16 నుంచి 
16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు.
18 ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.
19 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.


నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము
యెహొషువ24:15


Shalom. The Lord is coming soon. He is coming soon. Please be prepared.

May the Lord God Almighty be praised for ever and ever and ever in name of Lord Jesus Christ Amen.

samayam ledu mitrama yesu prabhuvu nu angiranchandi


Time's up get ready for Christ


Psalms 34:8
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.

అందరికి వందనాలు. 


My dear brothers and sisters i am weak in Telugu language. Please excuse me for any spell mistakes. 
I have wasted so much of my time and since the day i realized that Jesus is the True Savior, even though i don't know much of bible, i want to share what i know and aware everyone of my fellow Christians.

Comments

Popular posts from this blog

Gadachina kalam song lyrics In Telugu & English- గడచిన కాలం కృపలో మమ్ము

Gadachina kalam song lyrics: Here is the song lyrics for gadachina kaalam song. Sing praise to God by singing the gadachina kalamu lyrics. Gadichina kaalam song is a famous Telugu Christian song. Gadichina kalamu song lyrics has very deep meaning in it. Gadichina kaalam lyrics means "We Thank you God for guiding us, helping us till now.. and the whole song lyrics of gadichina kalam follows by praising the GOD. Gadachina kalam song lyrics in Telugu: Here is the song lyrics of Gadichina kalamu song lyrics in Telugu. View this beautiful gadichina kalamu song lyrics and share with your friends and family. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2 సార్లు) గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.. పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము... (2 సార్లు) మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2 సార్లు)  ||గడచిన కాలము కృపలో మమ్ము||  కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నను ఆదరించిన కలుషము నాలో కానవచ్చినా కాదనక నను కరుణించిన (2 సార్లు) కరుణించిన దేవా నీకే...

Yepati Dananaya Song Lyrics in Telugu | ఏపాటిదాననయా...

ఏపాటిదాననయా Yepati Dananaya Song is a very famous christian telugu song. Yepati Dananaya nannu intaga song lyrics is available for you to download on this page. Yepati Dananaya nannu intaga hechinchutaku song is a wonderful telugu christian devotional song. Yepati Dananaya song lyrics has both male and female versions.  Yepati Dananaya song has very emotional meaning in it. The song Yepati Dananaya means that i am not worthy but you have never let me go. This song is basically thanking God for not letting us go away from his Holy presence, even though we are sinners. Sing this awesome Telugu Christian Song Yepati Dananaya song in your Churches and praise the lord God Almighty. Hope you liked the Yepati dhananaya nannithaga hecchinchutaku song lyrics in telugu please comment for more song lyrics.

బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు | ఆసక్తికరమైన విషయాలు.

బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు - ఆసక్తికరమైన విషయాలు 📎ఆదాము - ఎఱ్ఱనివాడు, నిర్మింపబడినవాడు. 📎అబ్రాము - గౌరవనీయుడగు తండ్రి. 📎హానోకు - ప్రతిష్టింపబడినవాడు. 📎నోవాహు - నెమ్మది  📎ఇస్సాకు- నవ్వు. 📎యాకోబు-మోసపుచ్చు వాడు.  📎కయీను -పొందుట;  📎హేబేలు-ఆవిరి. 📎ఏసావు-వెంట్రుకలు గలవాడు.  📎యోసేపు-అభివృద్ధి ; 📎షెతు-బదులుగా ఇవ్వబడినవాడు;  📎అబ్రహాము- అనేక జనములకు తండ్రి.  📎బయర్షెబా -ప్రమాణపు బావి.  📎బేతేలు-దేవుని ఇల్లు; 📎హెబ్రోను -సహవాసం. 📎హవ్వ -జీవము 📎లేయ -అడవి ఆవు.  📎రాహేలు -ఆడగొర్రె;  📎శారాయి-జగడగొండి; శారా-రాజమారి 📎రిబ్కా- ఉచ్చుతాడు 📎దీనా -న్యాయపు తీర్పు 📎తామారు-ఈతచెట్టు. 📎షేము- పేరు,నామము;  📎హాము-అల్లకల్లోలం, నల్లనివాడు;  📎హాగరు-యాత్రికురాలు,సంచరించుట. 📎మెల్కిసేదెకు-నీతిరాజు, 📎షాలేము యాజకుడైన రాజు;  📎మెతూషెల -ఈటే గలవాడు. 📎ఎఫ్రాయిము-రెండంతలువృద్ధి, ఫలము 📎ఎఫ్రాతా -ఫలవంతమైన స్థలం. 📎ఏదేను- ఉల్లాసము;  📎నిమ్రోదు- తిరుగుబాటు, దైవ ద్రోహి.  📎ఎనోషు- మానవుడు;  📎బాబేలు- గందరగోళం. 📎మోషే -నీటి నుండి...