Skip to main content

Manovicharamu Kudadu Niku Song Lyrics | Telugu Christian songs

Find deep comfort and reassurance in the beautiful Telugu Christian song, Manovicharamu Kudadu Niku (మనోవిచారము కూడదు నీకు). These unique lyrics are written as a loving message directly from God to a believer, urging them not to worry, to trust in His perfect timing, and to rest in His divine provision. It is a powerful song to sing when you are feeling anxious or overwhelmed by life's burdens.

Manovicharamu Kudadu Niku Song Lyrics in Telugu

మనోవిచారము కూడదు నీకు
మహిమ తలంపులే కావలెను
దినక్రమాన శాంతి గుణంబులు
దీనులకిచ్చుచుందును

ఆలస్యమైనంత మాత్రమున
అవి నెరవేర వనవద్దు
కాలము పరిపూర్ణంబుకాగా
ఖచ్చితముగ అన్నియు నెరవేరును

నిత్యానందము సత్యానందము
నీలోనేనమర్చితి
అత్యానందము అగపడుచుండును
ఆలోచించుచున్న కొలది

కోరవు నీకు కావలసినవి
ఊరకనె నీకిచ్చెదను
ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి
వస్తువులన్నియు గలవు

నీరసపడకుము నీరసపడకుము
నీవె నా ఆస్తిగదా
నారక్తముతో సంపాదించితి
నన్ను నీ ఆస్తిగ గైకొనుము

ఆనందతైలముతో నిన్ను
అభిషేకించి యున్నాను
స్నానము ప్రభు భోజనము ప్రజలకు
జరుపుట సరియని అనుచున్నాను

నీకు కావలసినవి అడుగుము
నేను తప్పక ఇచ్చెదను
నీకు ఇచ్చుట నాకానందము
నీవు అడుగుట ముచ్చటనాకు

నీ కష్టములు నీ కోరికలు
నాకెరుకె అవి యుండవుగా
లేకుండగా జేసెదను అప్పుడు
లేడివలె గంతులు వేయుదువు

నీకవసరమైనవి కావలసిన
నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును
కాకులకాజ్ఞయిచ్చి
ఏలియాకు ఆకలితీర్చలేదా

సైకిళ్ళు స్టీమర్లు బండ్లు
సంచారమునకు అవసరమా
లోకులు కోరిన యెడల అవియు
నీకవి సుళువుగ లభియించు

ఎండయు చలియు వానయు గాలియు
ఏమియు చేయ నేరవు నిన్ను
తిండికి బట్టకు బసకు శద్ధికి
తీరికకు యే కొదువయె యుండదు

జంతువు పశువు పురుగు పక్షి
జబ్బు ఏమియు చేయవు నీకు
సంతోషముతో నా సందేశము
చాటగ అదియు చాటుచునుండుము

నీ బలహీనత తట్టుచూడకు
నా బలము తట్టిదిగో చూడుము
నీ బలమునకు మించిన పనులు
నా బలమేగదా చేయవలెసెను

పాపివని నీకెవడు చెప్పెను
పావనుడవై యుండగను
శాప మరణమురాదు నీకు
చావును చంపిన జీవము నేనే

నా రూపలావణ్యములు
నీ రూప లావణ్యములగును
నా రక్తము ప్రతి నిమిషము నీలో
ధారగ ప్రవహించును అది జీవము

We hope you found peace and encouragement while reading and singing these beautiful Telugu Christian lyrics. What is your favorite verse from Manovicharamu Kudadu Niku? Please leave a comment below, and feel free to request any other song lyrics you would like us to add to the site!

Comments

Popular posts from this blog

Neevunte naku chalu yesayya lyrics in English & Telugu- Telugu Christian song lyrics

Find total peace and strength in the presence of God with the deeply emotional Telugu Christian song, Neevunte Naku Chalu Yesayya (నీవుంటే నాకు చాలు యేసయ్యా) . This beautiful hymn of surrender declares that having Jesus by our side is enough to face any storm whether it be sickness, loss of wealth, or the desert seasons of life. It is a powerful anthem for every believer who relies solely on God's grace and guidance. Neevunte Naku Chalu Yesayya Lyrics in Telugu పల్లవి : నీవుంటే నాకు చాలు యేసయ్యా.... నీవెంటే నేను ఉంటానేసయ్యా (2 సార్లు) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2 సార్లు) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2 సార్లు) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2 సార్లు) || ...

7 Words Of Jesus In Telugu | 7 matalu in Telugu | Good Friday 7 words in Telugu Images

As written in the Holy Bible, Jesus Christ, the Son of God, willingly gave His life to save us from our sins. During His ultimate sacrifice, He endured immense suffering on the cross. On the solemn occasion of Good Friday, believers all over the world reflect on the final moments of His life and the profound messages He left behind. Below is the complete list of the 7 Last Words of Jesus on the Cross in Telugu (సిలువలో యేసు పలికిన ఏడు మాటలు) . Please take a moment to meditate on this great sacrifice, and feel free to share these beautiful devotional images with your friends, family, and church community. యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు 1. లూకా సువార్త 23:34 "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" 2. లూకా సువార్త 23:43 "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను" 3. యోహాను 19:26-27 "అమ్మా, యిదిగో నీ కుమారుడు... యిద...