Reflect on the temporary nature of life with the thought-provoking Telugu Christian song, Gaddi Puvvu Lantidi Manava Brathuku (గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు). Written and composed by Dr. K.S.V. Sagar (Satya Veda Sagar Brother), these powerful lyrics remind us that human life is as fleeting as a flower in the grass. It is a beautiful call to seek salvation, live a holy life, and draw closer to God while we have the time.
Gaddi Puvvu Lantidi Manava Brathuku Song Lyrics
పాట రచన, స్వరకల్పన (Lyricist & Composer): డా॥ కె.ఎస్.వి. సాగర్ (Dr. K.S.V. Sagar / Satya Veda Sagar Brother)
పల్లవి:
గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు
ఎందుకయ్య వెతుకులాట చచ్చేవరకూ (2)
సూర్యుడు వస్తే పువ్వు రాలిపోతుంది
మరణం వస్తే నువ్వు రాలిపోవాలి...
పువ్వులా రాలిపోవాలి...
1. నల్లని నీ తలలో తెల్లని వెంట్రుకలొచ్చి
గుర్తు చేస్తున్నాయి నీ వయసు నీ....
నీ సమయం ఆసన్నమయినదనీ (2)
ప్రాణం పోకముందే ప్రభుని నమ్ముకో
సమయముండగానే రక్షణను పొందుకో (2)
|| గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు ||
2. అందరు నీ వారని అన్నీ నీవేనని
మోసపోతున్నావా ఓ సోదరా...
నీదసలీ లోకమే కాదురా... (2)
లోకాశల నుండీ దూరముగా పారిపో
పరిశుద్ధునిగా బ్రతికి ప్రభు చెంతకు చేరిపో (2)
|| గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు ||
మరిన్ని ఆసక్తికరమైన దైవ పాటలకు ఈ సైట్ ను మరల వీక్షించగలరు. అందరికి వందనాలు. (Thank you to everyone. Please visit our site again for more interesting and spiritual Telugu Christian songs!) Feel free to share this deeply meaningful song with your church members, friends, and family. Let us know your thoughts in the comments!
Comments
Post a Comment