అబ్రహాము ఇస్సాకు యాకోబులు Abrahamu Issaku Yakobulu Song Lyrics by Sagar brother: రచన, స్వరకల్పన: డా॥ కె.ఎస్.వి. సాగర్ (Sagar brother garu) పల్లవి: అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులూ (2) ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమువలే ఉండగా (2) భయమెందుకు! దిగులెందుకు! సాగిపోముందుకూ (2) 1. బీడు బారిన బ్రతుకులు దున్నటానికే ఏర్పరచబడినావు దేవుని కొరకే... (2) నాగటిపై చెయ్యి పెట్టి వెనక చూడకూ... (2) ప్రభులోనికి అడుగుపెట్టి లోకాన్ని కోరకు (2) ॥అబ్రహాము ఇస్సాకు యాకోబులు|| 2. ఒంటరిగా ఉన్నానని కలత చెందకూ... ఘనుడైన యెహోవాను మరిచి బ్రతకకూ (2) దేవునికై బ్రతుకు వారు నీకు ఆప్తులు (2) కష్టాలు కన్నీళ్ళు మనకు ఆస్తులు (2) ॥అబ్రహాము ఇస్సాకు యాకోబులు|| 3. ప్రభువెపుడు తనవారిని విడిచిపోడని శ్రమలలో తనవారికి తోడుంటాడని (2) విడిచి పెట్టకు నీదు విశ్వాసమును (2) విడిచిపెట్టు ప్రభుకొరకు తుదిశ్వాసను (2) ॥అబ్రహాము ఇస్సాకు యాకోబులు||
Telugu Christian online suvartha