Junte Thene Daralakanna Song Lyrics In Telugu
పల్లవి:
జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం....
యేసయ్యా సన్నిధినే మరువజాలను.... (2 సార్లు)
జీవిత కాలమంతా.... ఆనందించెదా.... యేసయ్యనే ఆరాధించెదా.... (2 సార్లు)
|| జుంటె తేనె ధారలకన్న ||
1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి (2 సార్లు)
నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2 సార్లు)
|| జుంటె తేనె ధారలకన్న ||
2. యేసయ్య నామమే బలమైన దుర్గము
నాతోడై నిలచి క్షేమముగా నను దాచి (2 సార్లు)
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2 సార్లు)
|| జుంటె తేనె ధారలకన్న ||
3. యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించె సువాసనగా నను మార్చె (2 సార్లు)
నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2 సార్లు)
|| జుంటె తేనె ధారలకన్న ||
We hope you enjoyed singing this beautiful Telugu Christian song and felt the sweetness of His presence. What is your favorite verse? Please leave a comment below, and don't forget to share these lyrics with your church worship team!
Comments
Post a Comment