Prabhu Samskarapu Vindu - ప్రభు సంస్కారపు విందు
ప్రభు సంస్కారపు విందు - Song Lyrics:
ప్రభు సంస్కారపు విందు - ప్రభు సంస్కారపు విందు
పరుగు ఎత్తుకొని రండి - ప్రభువే మన విందు
ప్రభువు జతకిదే సందు - పాప వ్యాధికి మందు
సభలన్నిటి యందు - సంతుష్టి పెంపొందు || ప్రభు ||
1. అందుకొను రొట్టెతో - ఆయన శరీరము
నందుకొందుము మర్మ - మది యద్భుతంబు
ఎందరెన్నో మార్లీ - వందల ఏండ్లలో
వందించి తిన్నను - బాధయు తరుగలేదు || ప్రభు ||
2. అందుకొను రసముతో - ఆయన రక్తము
నందుకొందుము మర్మ - మది యద్భుతంబు
ఎందరెన్నో మార్లీ - వందల ఏండ్లలో
వందించి త్రాగినను - బాధయు తరుగలేదు || ప్రభు ||
3. మన రక్షకుడు దేవ - తనయుండు రండని
కనిపెట్టు చున్నాడు గనుకనే రండి
మనసులోని అడ్డులను - నొత్తిగించి మీ
మనసు ప్రభువునకిచ్చి - వెనుకాడకను రండి || ప్రభు ||
4. పాపాత్ములందరికి - ప్రభువే స్వయంబుగా
బంతి భోజనము యేర్పరచి యున్నాడు
పాపు లేక సహ - వాసులై యేసుని
దాపున నొక సభగా - ధన్యులౌ విందిదియె || ప్రభు ||
5. పాపి పాపియంచు - ప్రభువు కలవరించు
ప్రభువు ప్రభువని - కలవరించు చుండుము
నా పాపి విందునకు - నడచి రాకున్న
నా తాపమెంతో చెప్ప - దగునా యను చున్నాడు || ప్రభు ||
6. భోజన వస్తువులు - భుక్తికి గుర్తులు
భోజన వస్తువులు - ముక్తి భక్తి సాధనముల్
రాజు మన తండ్రి ఈ - రాత్రి భోజన కర్త
యే జన విశ్వాసికిని - యేసును వడ్డించును || ప్రభు ||
7. ఇది మోక్ష మందున - ఇకను జరుగబోవు
వధువు సంఘ వైవాహికపు విందున్
మదిని జ్ఞప్తికి తెచ్చు - మహిమానందము నిచ్చు
పదిలంబుగ సిద్ధపడుచు - రండి రండి || ప్రభు ||
8. ప్రభు భోజనము వలన - పాప పరిహారంబు
ప్రభు భోజనము వలన - స్వస్థ కార్యంబు
ప్రభుని బల్లకు తెల్ల - పావురము లన్నట్టు
శుభముతో భక్తులు - శోభిల్లు చుందురు || ప్రభు ||
9. మనము ప్రభుని ముట్టుకొను - భోజన పంక్తి
మనలనాయన ముట్టుకొను - భోజన పంక్తి
మన తండ్రితో యింత - చను వాయెను ఈ
చనువు చనువు మోక్ష - స్థలము వరకు పెరుగు || ప్రభు ||
10. సరిగా నుండి భోజనము గైకొనుచున్న
నరకమను రెండవ - మరణము లేదు
మరి కొన్నాళ్ళకు వచ్చు - మరణము పరలోక
పురమునకు ద్వారమై - మరణ మని పింపదు || ప్రభు ||
11. రెండవ రాకడ - కుండు వారికి చావు
ఉండనే ఉండదు - ఉండు జీవంబు
నిండు మహిమ యుండు - నిజ శరీరము దాల్చి
యుండి ఎగుర గలము - ఉర్ధ్వ లోకమునకు || ప్రభు ||
12. జనక కుమారాత్మ - లను త్రైక దేవుండీ
దినమున మనలను - దీవించు చుండు
మన మనసులను బట్టి - జనకత్రైకుడొందు
ఘనత మహిమ స్తోత్ర - గానముల్ సత్కీర్తి || ప్రభు ||
I hope this lyrics made you get closer to our Lord and Savior Jesus Christ. Please comment below your views and suggest us new telugu song lyrics.
Comments
Post a Comment